Header Banner

శ్రీధర్ రెడ్డి వైద్య పరీక్షలు పూర్తి.. సిట్ కస్టడీకి తరలింపు! ఈ కేసులో ఏ31, ఏ32గా..

  Fri May 16, 2025 11:56        Politics

ఏపీ లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam) సజ్జల శ్రీధర్ రెడ్డిని (Sajjala Sridhar Reddy) రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత సిట్ కార్యాలయానికి సజ్జలను పోలీసులు తరలించారు. సిట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. తొలిరోజు నిన్న (గురువారం) సాయంత్రం ఐదు గంటలకు వరకు సజ్జలను సిట్ విచారించింది. కాగా.. లిక్కర్ స్కాం కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌ రెడ్డిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి శ్రీధర్‌ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. దీంతో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులు శ్రీధర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

 

ఇది కూడా చదవండి: లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఇప్పటికే తొలిరోజు ప్రశ్నించిన సిట్.. రెండో రోజు కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఏపీ మద్యం వ్యవహారంలో కీలక నిర్ణయాల సమయంలో రాజ్‌ కసిరెడ్డితో సజ్జల శ్రీధర్ ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురిని సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో సజ్జలతో పాటు రాజ్‌కసిరెడ్డి పీఏ దిలీప్‌ను కూడా నిన్న (గురువారం) సిట్ విచారించింది. నిన్నటితో దిలీప్ విచారణ ముగిసింది. అలాగే ఈ కేసులో సజ్జల, దిలీప్ ఏసీబీ కోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేయగా నిన్న(గురువారం) విచారణ జరిగింది. అయితే శ్రీధర్‌ రెడ్డి పిటిషన్‌పై ఈనెల 20, దిలీప్ పిటిషన్‌పై నేడు (శుక్రవారం) కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రాసిక్యూషన్‌ను కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో ఏ31గా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఏ32గా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. రెండు రోజుల పాటు వీరిరువురు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణానికి సంబంధించి వివిధ రూపాల్లో ఇరువురిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #andhraPradesh #LiquorScam #SajjalaCustody #Investigation #Vijayawada #Appolitics #YCP #APNews